HOME » VIDEOS » Andhra-pradesh

Video : బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ బాధితురాలికి సీఎం జగన్ సాయం..

ఆంధ్రప్రదేశ్22:31 PM November 25, 2019

హైదరాబాద్ హైటెక్‌సిటీలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద కారు ప్రమాదం ఘటనలో గాయపడిన యువతికి సాయం చేసేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. బయోడైవర్సిటీ కారు ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, అనంతపురం జిల్లాకు చెందిన కుబ్రా బేగం తీవ్రంగా గాయపడింది. బాధితురాలికి ఆపరేషన్ కోసం రూ.5లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. కుబ్రా బేగం తండ్రి ఓ సాధారణ కార్పెంటర్. అంత డబ్బులు చెల్లించే స్తోమత లేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి తెలిసింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కుబ్రా బేగం ఆపరేషన్ కోసం సాయం చెయ్యడానికి ముందుకొచ్చారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు తక్షణమే ఆపరేషన్ కోసం కావలసిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందచెయ్యాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

webtech_news18

Top Stories