YSR Kanti Velugu scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టిన ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. వరల్డ్ సైట్ డే సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు వైఎస్ఆర్ కంటివెలుగు కింద లభిస్తాయి. 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలవుతుంది. ముందుగా... 70 లక్షల మంది బడి పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. తొలిదశలో... నేటి నుంచీ 16 వరకూ... 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత... నవంబర్ 1 నుంచీ డిసెంబర్ 31 వరకూ... రెండో దశలో... కంటి వైద్య పరీక్షలు జరుపుతారు. అందులో భాగంగా... స్క్రీనింగ్, కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. ఈ క్రమంలో క్యాటరాక్ట్ ఆపరేషన్, ఇతర వైద్య సేవల్ని ఉచితంగా చేయబోతున్నారు. ఇక 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ ఆధారంగా కంటి పరీక్షలు జరగనున్నాయి. అవి ఫిబ్రవరి 1 నుంచీ ప్రారంభమవుతాయి. మొత్తంగా ఏపీలో 80 శాతం అంధత్వాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ స్కీం తెస్తున్నారు. ఇందులో ప్రతీదీ ఉచితంగానే చేయబోతున్నారు కాబట్టి... ప్రజలంతా ఈ స్కీం ప్రయోజనం పొందాలని ప్రభుత్వం కోరుతోంది.