73rd Independence Day : ఆంధ్రప్రదేశ్లో తొలిసారి వైసీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం హోదాలో మొదటిసారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న జగన్... స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. జెండా ఆవిష్కరణ తర్వాత జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు వైఎస్ విజయమ్మ, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, కొందరు మంత్రులు, డీజీపీ సవాంగ్ హాజరయ్యారు.