న్యూ ఇయర్ మొదటి రోజునే అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ప్రారంభమైంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు ఏపీకి కేటాయించిన 13 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. వారందర్నీ ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సన్మానించారు. విజయవాడలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటైంది.