ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ఏపీ రాజధానిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. 3 రాజధానుల విషయంపై చర్చించనున్నారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రాజధాని రిపోర్టుపైనా భేటీలో చర్చించనున్నారు. భేటీ అనంతరం కొత్త రాజధాని పేరు చెబుతామని మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. కేబినెట్ భేటీ సందర్భంగా వెలగపూడి సచివాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా 144 సెక్షన్ విధించారు. అడుగడుగునా భద్రతను కట్టుదిట్టం చేశారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.