సెలబ్రిటీలైనా, ప్రజా ప్రతినిధులైనా బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం పరిపాటి. తాజాగా రాప్తాడు నియోజకవర్గం, వెంకటాపురం గ్రామస్థులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సునీత.