ఆంధ్రప్రదేశ్... గుంటూరు జిల్లా... నరసరావుపేటలో దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా మహిళా పోలీసులు హోంమంత్రికి గౌరవ వందనం చేశారు.