హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ధర లేక రైతు నోట తమలపాకు మంట..

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో తమలపాకుల పంట సాగుబడి ఎక్కువ. మండలంలోని చింతలపూడి, మాచవరం, మునుకుతురు, ఆలూరు తదితర ప్రాంతాల్లో ఈ పంటను విస్తారంగా సాగుచేస్తున్నారు. ఈ మండలంలో సుమారు 2 వేల హెక్టార్లలో తమలపాకు పంట సాగుబడి జరుగుతోంది. ఈ పంట గతంలోనే బాగానే ఉందని రైతులు అంటున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎండాకాలం ఎండలకి ఈ పంట ఆకు ఓడపడిపోవటం దానికి తోడు మొదటి కోత రాకపోవడం దాని వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతులు సంవత్సరానికి లక్షా 50 వేల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నామని ఈ ఏడాది పంట రాకపోవడమే కాక వచ్చిన పంట లాభసాటిగా లేదని రైతులు బాధపడుతున్నారు. వ్యాపారస్తులు వారి వద్ద బుట్ట తమలపాకులు 500 రూపాయలకు కొనుగోలుచేసి దాన్ని మహారాష్ర్ట, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే అక్కడ మాత్రం వ్యాపారులు 1100 నుంచి 12 వందల వరకు అమ్ముకుంటున్నారు. వ్యాపారులకు లాభాలు పండిస్తోంది కాని రైతులు మాత్రం నష్టపోతున్నారనే ఆరోపణలున్నాయి. 

webtech_news18