Andhra Pradesh Assembly Elections 2019 : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు పార్లమెంట్... చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో నేడు రీపోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం 5,451మంది ఓటర్లు ఇవాళ ఓటు వేస్తున్నారు. ముందుగా 5 స్థానాలకు రీపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశించింది. చివరి నిమిషంలో వెంకట్రామాపురం కుప్పం బాదూరు, కాలేపల్లి పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇదివరకు ఇక్కడ అల్లర్లు జరగడంతో ఈసారి అలా కాకుండా... ఒక్కో పోలింగ్బూత్కు 250 మంది పోలీసుల్ని నిఘా పెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ చేస్తూ రీపోలింగ్ జరిపిస్తున్నారు. నేతలు, చోటా మోటా నాయకులు ఎక్స్ట్రాలు చేస్తే, తాట తీస్తామని హెచ్చరించారు.