గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్లి ఆయన్ని గృహనిర్బంధం చేస్తున్నట్లు ప్రకటించారు. షాకైన పుల్లారావు... తనను నిర్బంధించినా... ఛలో అసెంబ్లీ జరిగి తీరుతుందని హెచ్చరించారు. అమరావతి జేఏసీ, టీడీపీ... ఛలో అసెంబ్లీకి పిలుపివ్వడంతో... అలర్టైన పోలీసులు ముందుగానే... ప్రతిపక్ష నేతలను గృహాల్లో నిర్బంధిస్తున్నారు.