అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ రాజధానిలో రైతుల ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. రాయపూడిలో నిరసనకారులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు చెరిపివేసి నల్ల రంగు పూశారు. ఎన్నికల్లో వైసీపీ కోసం కష్టపడి పనిచేశామని, ఇప్పుడు తమను ముంచేశారంటూ ఓ కార్యకర్త సీఎం జగన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.