అమరావతి ప్రాంతంలో తహశీల్దార్ వనజాక్షికి చేదు అనుభవం ఎదురయింది. సోమవారం కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు సభ ఏర్పాటు చేశారు. సభ జరుగుతున్న సమయంలో ఎమ్మార్వో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలి అన్నారు. దీంతో రైతులు ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. రౌడీ ఎమ్మార్వో అంటూ నినాదాలు చేసిన రైతులు.. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.