అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 77వ రోజుకు చేరాయి. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో అమరావతి రాజధానికి మద్దతుగా స్థానిక గ్రామస్తులు, రైతులు JAC అధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు చేస్తున్నారు. అయితే ఈరోజు అమరావతి మహిళా జేఏసీ సభ్యులు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసి, రాజధాని అంశంపై ఫిర్యాదు చేసారు.