రాజధానిగా అమరావతి తరలింపును దేవుడే అడ్డుకోవాలంటూ మహిళలు ప్రార్ధనలు చేసారు. మందడం ధర్నా టెంట్ లో గోవింద నామాలు, లలితా సహస్ర నామాలు పారాయణం చేసారు. ప్రతి ఒక్కరూ మా పోరాటానికి మద్దతు పలకాలి మహిళలు కోరారు. పట్టీపట్టనట్లు ఉండే ప్రజా ప్రతినిధులకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా వారు తెలియజేసారు.