HOME » VIDEOS » Andhra-pradesh

Video : తిరుమలపై చక్కర్లు కొడుతున్న విమానం.. టీటీడీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్15:23 PM February 05, 2020

తిరుమల కొండపై మరోసారి విమానం హల్ చల్ చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘నో ఫ్లైయింగ్‌ జోన్‌’గా ప్రకటించిన తిరుమలపై కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా(ఎస్‌వోఐ) ఛార్టెర్డ్‌ విమానం రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఐదేళ్లకోసారి విమానాల ద్వారా దేశ భౌగోళిక పరిస్థితులను ఎస్‌వోఐ సర్వే చేయిస్తుంది. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి విమాన వేంకటేశ్వరస్వామికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే నియమం ఉంది. దీనిపై గతంలోనూ ఏవియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేసింది.  ప్రస్తుతం రెండు రోజులుగా తిరుమలపై విమానం ఎగరడాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు.. చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కు ఫిర్యాదు చేశారు. ఇకపై తిరుమల క్షేత్రంపైకి విమానాలు పంపబోమని ఏటీసీ అధికారులు చెప్పారన్నారు.

webtech_news18

Top Stories