రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ 'సాహో' ఫీవర్తో ఊగిపోతున్నారు. థియేటర్స్ వద్ద 'జై రెబల్ స్టార్' నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రభాస్ సొంతూరు భీమవరంలో పరిస్థితి చెప్పనక్కర్లేదు. భీమవరం ప్రధాన రహదారిపై కిలోమీటర్ల పొడవునా ప్రభాస్ ఫ్లెక్సీలు,బ్యానర్లే దర్శనమిస్తున్నాయి.దాదాపు 200 అడుగుల భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. గతంలో ఏ హీరో ఫ్లెక్సీని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన దాఖలా లేదు.