హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : బుల్లెట్ ట్రైన్ కాలంలోనూ ఆదరణ తగ్గని రైల్ బస్సులు

ఆంధ్రప్రదేశ్09:53 AM August 08, 2019

Rail Bus : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బుల్లెట్ ట్రైన్స్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ... అదే సమయంలో ఏపీలోని పల్లెల్లో రైల్ బస్‌లను విజయవంతంగా నడుపుతోంది. నగరాల్నీ, పట్టణాల్నీ చిన్న గ్రామాలతో కలిపేందుకు ప్రవేశపెట్టిన రైల్ బస్సులు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా... కాకినాడ-కోటిపల్లి మధ్య ఓ రైల్ బస్సు,... విజయనగరం జిల్లా బొబ్బిలి-సాలూరు మధ్య మరో రైలు బస్సు రోజూ ప్రయాణికుల్ని గమ్యానికి చేరుస్తున్నాయి. స్ధానిక అవసరాలతో పాటు పర్యాటక రంగం అభివృద్ధికీ అవి ఉపయోగపడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి కోటిపల్లి మార్గంలో 45 కిలోమీటర్ల పరిధిలో రైల్ బస్‌ రోజూ విజయవంతంగా నడుస్తోంది. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరే రైల్ బస్... మధ్యాహ్నం 12 గంటల కల్లా కోటిపల్లి చేరుకుంటుంది. తిరిగి వెంటనే బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల కల్లా కాకినాడ చేరుకుంటుంది. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, సాలూరు మధ్య 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా రైల్వేశాఖ గతంలో రైల్‌ బస్‌ను ప్రవేశపెట్టింది. ఆర్టీసీ బస్సులతో పోలిస్తే అతి తక్కువ ఛార్జీతో ఇందులో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. బొబ్బిలి నుంచి సాలూరు మార్గంలో కేవలం రెండే స్టేషన్లు నారాయణప్పవలస, రొంపల్లె ఉంటాయి. బొబ్బిలి-సాలూరు మధ్య 16 కిలోమీటర్ల దూరాన్ని రైల్ బస్సు కేవలం 40 నిమిషాల్లో చేరుకుంటుంది. కేవలం 10 రూపాయల ఛార్జీ మాత్రమే ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్‌ బస్‌ రోజుకు ఐదు ట్రిప్పులు వేస్తోంది.

Krishna Kumar N

corona virus btn
corona virus btn
Loading