విశాఖపట్టణంలో ఓ తాగుబోతు హల్చల్ చేశాడు. వుడా చిల్డ్రెన్ థియేటర్ వద్ద మద్యం మత్తులో న్యూసెన్స్ చేశాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడిని వారించే ప్రయత్నం చేశాడు. దాంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తి ఓ డమ్మీ కత్తిని చూపించి పోలీసును బెదిరించాడు. నన్నే తిడతావా.. పొడిచేస్తానంటూ కత్తితో వెంబడించాడు. నవంబరు 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీపీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడినిఅరెస్ట్ చేసి విచారిస్తున్నారు.