విజయవాడలో అతనో బిక్షగాడు. ఆలయం దగ్గరకు వచ్చే భక్తుల్ని సాయం చెయ్యమని బిక్షం కోరేవాడు. భక్తులు కూడా ఎంతో కొంత మనీ ఇచ్చేవాళ్లు. అలా ఆయన తన జీవిత కాలంలో రూ.8 లక్షలు సంపాదించాడు. ఇప్పుడు అనారోగ్యం రావడంతో... ఆ డబ్బును ఆలయ అభివృద్ధి, గోశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చేశాడు. అతని దాతృత్వాన్ని చూసి భక్తులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.