కారులో తరలిస్తున్న రూ.91లక్షల నగదును విజయవాడలోని సత్యనారాయణపురం స్టేషన్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తొలి రోజే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం బెజవాడలో కలకలం రేపింది. పోలీసులు విచారించగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో భూమి కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్కోసం ఈ సొమ్ము తీసుకెళుతున్నట్లు చెప్పారు. నగదుకు సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.