తల్లి కావాలనే కోరికను 74 ఏళ్ల వయసులో తీర్చుకుంది మంగాయమ్మ. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో పెళ్లైంది. అప్పటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. కానీ వాళ్ల కోరిక తీరలేదు. 73 ఏళ్లొచ్చినా... మంగాయమ్మకు పిల్లలపై కోరిక తగ్గలేదు. ఈ క్రమంలో 2018లో చెన్నై వెళ్లిన మంగాయమ్మ దంపతులు... ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానం పొందాలని ప్రయత్నించినా అదీ విఫలమైంది. అయినప్పటికీ ఆశ వదులుకోని దంపతులు 2018 నవంబర్లో గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడ మంగాయమ్మ మరోసారి ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెంట్ అయ్యింది. గురువారం డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ నిపుణులు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ ఉమాశంకర్ టీమ్... ఈ ఆపరేషన్ నిర్వహించింది. పండంటి కవల పిల్లలకు మంగాయమ్మ జన్మనిచ్చింది.