హోమ్ » వీడియోలు

Video: షాకింగ్..భారీగా కుక్క మాంసం సీజ్

జాతీయం07:56 PM IST Nov 17, 2018

చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్‌లో సుమారు వెయ్యి కేజీల కుక్క మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి చెన్నై వచ్చిన జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో కుక్క మాంసాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫుడ్‌సెక్యూరిటీ అధికారులతో కలిసి స్టేషన్‌కు వెళ్లారు. ప్లాట్‌ఫాంపై ఉన్న పార్శిళ్లను తనిఖీలు చేసి..అందులో ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదంతా కుక్క మాంసమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ మాంసాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. కుక్క మాంసాన్ని నగరంలోని రెస్టారెంట్‌లకు తరలించేందుకు దుండగులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది

webtech_news18