పేరు: విజయ్ దేవరకొండ
పుట్టిన రోజు: 9 మే 1989
రాబోయే సినిమాలు: లైగర్, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 9 మే 1989వ సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించారు. మొదట్లో నాటకాల్లో రాణించిన విజయ్, ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా (Nuvvila) సినిమాలో చిన్న పాత్రతో టాలీవుడ్ తెరంగేట్రం చేశాడు. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life is Beautiful) సినిమాలో కూడా చిన్న పాత్రలో మెరిసాడు విజయ్. ఇక నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో 2015లో వచ్చిన నాని (Nani) ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో మరింత పాపులర్ అయ్యారు.
పెళ్ళి చూపులు (Pelli Chupulu) సినిమాతో తన కంటూ హీరో ఇమేజ్‌ను సంపాదించారు విజయ్. ఆ తర్వాత ద్వారక (Dwaraka) అనే సినిమా వచ్చింది. ఇక ఆ తర్వాత అదే సంవత్సరం కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డితో (Arjun Reddy) స్టార్ హీరోగా మారారు.
2018లో ఏ మంత్రం వేశావో వచ్చింది. ఇక అదే సంవత్సరంలో పరశురామ్ పెట్లా (Prasauram Petla) దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందంతో (Geetha Govindam) మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత నోటా (NOTA) అనే తమిళ తెలుగు సినిమాతో వచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. మళ్లీ టాక్సీవాలా (Taxiwala) తో మరో మంచి విజయాన్ని అందుకున్నారు విజయ్. ఇక ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రెడ్ (Dear Comrade), వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover) సినిమాలు పెద్దగా అలరించకలేక పోయాయి.
విజయ్ దేవరకొండ ఫ్యూచర్ ప్రాజెక్టులు
పూరీ జగన్నాథ్ (Puri Jaganndh) దర్శకత్వంలో లైగర్ (Liger) అనే సినిమాను చేస్తున్నారు. ఛార్మి (Charmee), కరణ్ జోహార్ (Karan Johar) లు కలిసి నిర్మిస్తున్నారు. ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్‌తో ఉందనుందని తెలుస్తోంది.
వ్యాపారవేత్తగా మరో అడుగు
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమాలతో పాటు వ్యాపారం వైపు కూడా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దుస్తుల వ్యాపారంలో విజయవంతంగా దూసుకెళ్తున్న విజయ్ ఇటీవల థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. విజయ్ మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసారు విజయ్. మల్టీప్లెక్స్‌కు ఎవిడి సినిమాస్ అని పేరు పెట్టారు.