సమంత రూత్ ప్రభు
పుట్టిన రోజు: 28 ఏప్రిల్, 1987
సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) 28 ఏప్రిల్, 1987న మద్రాసులో జన్మించారు. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత గౌతమ్ వాసుదేవ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేశావే (Ye Maya Chesave) సినిమా (2010)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ సినిమా విజయం తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగా ఆపై తను నటించిన బృందావనం (Brindavanam), దూకుడు (Dookudu) (2011), ఈగ (Eega) (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Sitamma Vakitlo Sirimalle Chettu) (2013), అత్తారింటికి దారేది (Attarintiki Daredi) (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగులో టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా మారారు.
ఇటు తెలుగులో నటిస్తూనే మరోపక్క తమిళంలో రాణించారు. ఈగ ఏకకాలంలో తమిళ్‌లో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కడ కూడా సమంత మంచి ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. సమంత 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా రికార్డ్ క్రియేట్ చేశారు.
వెబ్ సిరీస్‌లతో దూకుడు
ఇక ఇటు సినిమాలు చేస్తూనే సమంత అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) సెకండ్ సీజన్‌తో అటు నార్త్‌లోను మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు.
నాగ చైతన్యతో పెళ్లి, విడాకులు
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తో సమంత పెళ్లి 2017లో జరిగింది. అయితే, వారిద్దరూ నాలుగేళ్లకే విడిపోయారు. 2021 చివర్లో తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
సమంత రాబోయే సినిమాలు
సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతుంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై మరో కొత్త చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం. ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. మరో తమిళ సినిమా కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal)లో కూడా నటిస్తున్నారు.