రోహిత్ శర్మ (Rohit Sharma) మహారాష్ట్రలో ( Maha Rasthra) 30 ఏప్రిల్ 1987న జన్మించాడు. అమ్మ పూర్ణిమా శర్మది విశాఖపట్నం (Visakhapatnam). తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్ లో కేర్ టేకర్ గా పనిచేసేవారు. రోహిత్ శర్మ తండ్రి ఆదాయం తక్కువ కావడం వల్ల బోరివలిలో తన తాత, పినతండ్రులు పెంచారు. అతని మేనమామ డబ్బుతో 1999 లో ఒక క్రికెట్ (Cricket) క్యాంపులో చేరాడు. రోహిత్ శర్మ ఒక ఆఫ్ స్పిన్నరుగా కెరీర్ ఆరంభించాడు. చిన్ననాటి కోచ్ లాడ్.. రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్ధ్యాలు గమనించి ఇన్నింగ్స్ను ప్రారంభించమని ఎనిమిదో స్థానం నుంచి అతన్ని ఓపెనరుగా పంపాడు. ఓపెనర్ గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. హారిస్, గిల్స్ షీల్డ్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్లలో సత్తా చాటాడు. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ కెరీర్ లో సత్తా చాటి టీమిండియా జట్టులో సంపాదించాడు.
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా రోహిత్ శర్మ (Rohit Sharma Records in ODI) చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఆటగాడు రోహిత్ శర్మనే (Rohit Sharma Sixes Records). మూడేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 217 సిక్సర్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2017లో 65, 2018లో 74, 2019లో 78 సిక్సర్లు సాధించాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్(264) పేరిట ఉంది.
ఐపీఎల్.. ముంబై ఇండియన్స్ జట్టులో
ఐపీఎల్ (IPL) లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు రికార్డు స్థాయిలో 5 పర్యాయాలు ట్రోఫీ అందించాడు. ఇక, 2021 టీ-20 వరల్డ్ కప్ తర్వాత టీ 20 క్రికెట్ కు టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్ గా నియమితుడయ్యాడు రోహిత్ శర్మ. ఇప్పటి వరకు 389 అంతర్జాతీయ మ్యాచ్ లు (అన్ని ఫార్మట్లు కలిపి) ఆడిన రోహిత్ 15,449 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు ఉన్నాయ్. ఐపీఎల్ లో 213 మ్యాచులాడిన హిట్ మ్యాన్ 5,611 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా (457) సిక్సర్లతో టాప్-3లో ఉన్నాడు.
రోహిత్ శర్మ ఫ్యామిలీ
2015లో తన ప్రేయసి రితికాశర్మ (Ritika Sajdeh)ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి సమైరా(Samaira Sharma) అనే ముద్దుల కూతురు ఉంది.