rashmika mandanna

Rashmika Mandanna వార్తలు

    పేరు: రష్మిక మందన్న

    పుట్టిన రోజు: 05-04-1996

    సినిమాలు:  కిరాక్ పార్టీ, అంజనీ పుత్ర, ఛమక్, ఛలో (Chalo), గీత గోవిందం (Geetha Govindam), దేవదాస్ (Devadas), యజమాన, డియర్ కామ్రేడ్ (Dear Comrade), సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru), భీష్మ (Bhimsha), పొగరు, సుల్తాన్, పుష్ప  (Pushpa-The Rise)

     

    రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించింది. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. ఆమెకు 2016లో 24వ స్థానం రాగా, 2017లో మొదటి స్థానం దక్కింది. ఇక రష్మిక మందన్న కిరాక్ పార్టీ (Kirak Party) చిత్రీకరణ సమయంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో (Rakshith Shetty) పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. జూలై 2017లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఏవో కారణాల వలన ఆ నిశ్చితార్థం రద్దయింది.

    కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ (Puneet RajKumar) సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో నాగ శౌర్య (Naga Shourya) తో కలసి నటించిన ఛలో (Chalo) ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో పాటు మహేష్ బాబు (Mahesh Babu), నితిన్ (Nithiin), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది.

    తెలుగు చిత్రాల్లో నటిస్తూనే 2021 లో విడుదలైన సుల్తాన్ అనే సినిమాతో తమిళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మిషన్ మజ్ను సినిమా ద్వారా రష్మిక హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా చేస్తున్నాడు. దాంతో పాటు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) తో కలిసి ‘గుడ్ బై’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. టాప్ టక్కర్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంటోంది రష్మిక మందన్న.

    2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక ఎన్నికైంది. ఇప్పటి వరకు ఈ ఘనతని సాధించిన వారిలో దిశా పటానీ  (Disha Patani), ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier), మానుషి చిల్లర్ (Manushi Chillar) ఉన్నారు.