Telugu News » Tag » Rashi Khanna
rashi khanna

రాశి ఖన్నా (Rashi Khanna)

  పేరు: రాశి ఖన్నా
  పుట్టిన రోజు: 30-11-1990
  పేరు తెచ్చిన సినిమాలు: మద్రాస్ కేఫ్, ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవకుశ, తొలి ప్రేమ, శ్రీనివాస కళ్యాణం,  ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్

  తెలుగుతో పాటు చాలా తక్కువ సమయంలో దక్షిణాది, ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి ఖన్నా (Rashi Khanna). తన అందమైన నవ్వు.. అద్భుతమైన అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. నవంబర్ 30, 1990న ఢిల్లీలో జన్మించింది రాశి ఖన్నా. సెయింట్ మార్క్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్ నుంచి స్కూలింగ్ పూర్తి చేసిన రాశి.. లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. అందులో బీఏ పూర్తి చేసింది. చదువులో మెరుగైన విద్యార్థి. కాలేజ్ టాపర్ కూడా. సింగర్ కావాలనేది రాశి ఖన్నా కల. దానికి తగ్గట్లుగానే శిక్షణ కూడా తీసుకుంది. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంది. ఆ తర్వాత అనుకోకుండా మోడలింగ్‌లోకి వచ్చింది. అక్కడ్నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు పడ్డాయి.

  సినిమాల్లోకి రాకముందు చాలా అడ్వర్‌టైజ్మెంట్స్‌లో నటించింది రాశి. ఆ తర్వాత మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా పరిచయం అయింది. అందులో హీరో జాన్ అబ్రహం (John Abraham) భార్యగా నటించింది రాశి. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా కూడా విజయం సాధించడంతో రాశి స్టార్ అయిపోయింది.

  తెలుగు సినిమాల్లోకి 2013లో ఎంట్రీ ఇచ్చింది రాశి. ఊహలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది. నటుడు శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) ఈ సినిమాకు దర్శకుడు. ఆ తర్వాత అక్కినేని వారి మనం (Manam) సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత వరసగా హీరోయిన్ పాత్రలు ఈమె కోసం క్యూ కట్టాయి. తెలుగు ఇండస్ట్రీలో రాశి ఖన్నాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరోలు కాకపోయినా మీడియం రేంజ్ హీరోలు బాగానే అవకాశమిస్తున్నారు ఈ ముద్దుగుమ్మకు. దాంతో అలా అలా కాలం గడిపేస్తుంది రాశి. ఈ మధ్య తెలుగు కంటే ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలపై ఫోకస్ పెడుతుంది రాశి ఖన్నా. బెంగాల్ టైగర్ (Bengal Tiger), సుప్రీమ్ (Supreme), జై లవకుశ (Jai Lavakusa), తొలి ప్రేమ (Toli Prema), వెంకీ మామ (Venky Mama) లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది రాశి ఖన్నా.

  రాశి ఖన్నా జీవితంలో ఓ ప్రేమకథ కూడా ఉంది. తాను తన 16వ ఏటనే ఓ అబ్బాయితో డేటింగ్ చేశానని సంచలన విషయాలు చెప్పింది రాశి. అతడు తన క్లాస్‌మేట్ అని.. ఇద్దరిదీ ఒకే వయసని.. అయితే తర్వాత అనుకోని కారణాలతో దూరమయ్యామని చెప్పింది. మొత్తానికి తను పదహారేళ్లకే డేటింగ్ చేసి తర్వాత విడిపోయామని చెప్పడంతో ఎవరతను అనేది తెలుసుకోడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు స్నేహితులు తప్ప ప్రేమికులు లేరని చెప్పింది ఈమె. గ్లామర్ షో విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది రాశి. తనకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావాలని.. కానీ కొందరు గ్లామరస్ పాత్రలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ తాను మాత్రం గ్లామర్ షోలో హద్దుల్లోనే ఉంటానని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో పక్కా కమర్షియల్ (Pakka Commercial), థ్యాంక్యూ (Thank You).. తమిళంలో సర్దార్ (Sardar),  తిరుచ్చిత్రమంబళం, మేథావి, సైథాన్ కి బచ్చా సినిమాల్లో నటిస్తుంది రాశి ఖన్నా.