Telugu News » Tag » Ram Charan
Ram Charan

Ram Charan వార్తలు

    పేరు: కొణిదెల రామ్ చరణ్ తేజ
    పుట్టిన రోజు: 25 మార్చి 1985
    రాబోయే సినిమాలు: ఆచార్య (గెస్ట్ రోల్) (Acharya), ఆర్ఆర్ఆర్ (RRR), RC15 (శంకర్ దర్శకత్వంలో సినిమా)

    రామ్ చరణ్ (Ram Charan) 1985 మార్చి 27న చెన్నైలో (Chennai) జన్మించారు. పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ (Chirutha) సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. చిరుత నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 12 సినిమాల్లో హీరోగా నటించిన రామ్ చరణ్. ‘ఖైదీ నెంబర్ 150లో (Khaidi No.150) మాత్రం తండ్రితో కలిసి గెస్ట్ అప్ఫీరియన్స్ ఇచ్చారు. హీరోగా మొదటి చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’లో మంచి నటనతో పాటు డాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక ఆ తర్వాత రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర’లో (Magadheera) ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో వచ్చిన ‘ఆరెంజ్’ (Orange) ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. రామ్ చరణ్ ‘జంజీర్’ మూవీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఇటు తెలుగులోను అటు హిందీలోను ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    సొంత బ్యానర్.. నిర్మాతగా రామ్ చరణ్
    రామ్ చరణ్ తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రొడక్షన్స్ (Konidela Production Company) స్థాపించి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో నిర్మాతగా మారారు. కొరటాల శివ (Korataka Siva) దర్శకత్వంలో ఆచార్యలో (Acharya) అరగంటకు పైగా నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారు. రామ్ చరణ్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. హీరోగా 12 సినిమాల్లో నటించారు రామ్ చరణ్.

    ఉపాసనతో పెళ్లి
    రామ్ చరణ్ వివాహం ఉపాసన కామినేనితో 2012 జూన్ 14న జరిగింది.  వారిది ప్రేమ వివాహం. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఉపాసన వ్యాపారవేత్త. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. URLife వ్యవస్థాపకురాలు.