Telugu News » Tag » Rakul Preet Singh
Rakul Preet Singh

Rakul Preet Singh వార్తలు

    పేరు: రకుల్ ప్రీత్ సింగ్

    పుట్టిన రోజు: 10 అక్టోబర్ 1990

    సినిమాలు: గిల్లి, కెరటం, యువన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (Venkatadri Express), లౌక్యం (Loukyam), కరెంట్ తీగ (Current Teega), పండగ చేస్కో (Pandaga Chesko), కిక్ 2 (Kick 2), బ్రూస్లీ (Bruclee- The Fighter) , నాన్నకు ప్రేమతో (Nannaku Prmatho), సరైనోడు (Sarrainodu), ధృవ (Dhruva), విన్నర్ (Winner), రారండోయ్ వేడుక చూద్దాం (Rarandoi Veduka Chuddham) , జయ జానకి రామ (Jaya Janaki Rama), స్పైడర్ (Spyder), మన్మథుడు 2 (Manmadhudu -2), చెక్ (Check), కొండపొలం (Kondapolam)

    రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్. ఒకప్పటి నెంబర్ వన్ హీరోయిన్. చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ ఈ రోజు పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయింది. అక్టోబర్ 10, 1990న ఢిల్లీలో పుట్టింది రకుల్. అక్కడే చదువు కూడా పూర్తి చేసుకుంది. చిన్నప్పటి నుంచి కూడా మోడలింగ్ అంటే ఉన్న ఆసక్తి ఈమెను సినిమా రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. హీరోయిన్‌గానే కాకుండా బిజినెస్ ఉమెన్‌గానూ రాణిస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించింది రకుల్. పంజాబీ కుటుంబంలో నుంచి వచ్చిన ఈమె ఇప్పుడు హైదరాబాద్‌లోనే సొంతిళ్లు తీసుకుని ఉంటుంది.

    ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసుకుంది రకుల్. ఇండస్ట్రీకి రాకముందు తొలిగుర్తింపు కోసం చాలా ఏళ్ళ పాటు కష్టపడింది. మిస్ ఇండియా పోటీలో పీపుల్ ఛాయిస్ ఆప్ ‘మిస్ ఇండియా’గా ఎంపికయ్యింది. ఆ తర్వాత మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది. ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అదే 7 బై జీ బృందావన కాలనీ కన్నడ రీమేక్. ఆ తర్వాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. తెలుగులో తొలిసారి కెరటం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు రావడమే కాకుండా క్రేజ్ కూడా తెచ్చుకుంది.

    2014లో రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ 2 సినిమాతో తొలిసారి స్టార్ హీరో సరసన నటించింది. ఆ వెంటనే రామ్ చరణ్ బ్రూస్లీ, ధృవ.. అల్లు అర్జున్ సరైనోడు.. మహేష్ బాబు స్పైడర్.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో లాంటి సినిమలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా రకుల్ స్టార్ హీరోలకు ఫేవరేట్ ఛాయిస్ అయిపోయింది. సినిమాలు కాకుండా ఈమె జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణి కూడా. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. ఇక గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం అంటే రకుల్‌కు చాలా యిష్టం. క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన చేయడం ఈమె అలవాట్లు. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా సాధించింది. నచ్చే సెలెబ్రిటీలు షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.