HOME » pro kabaddi league
Pro Kabaddi League

Pro Kabaddi League

కబడ్డీ ( Pro Kabaddi 2021).. కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. ఈ కూత వింటేనే ఒళ్లంతా పూనకం వస్తుంది. చిన్నప్పుడు స్కూల్ లో ఆడిన జ్ఞాపకాలు మదిలో మెదలాల్సిందే. మాయదారి రోగం కరోనా కారణంగా గతేడాది వాయిదాపడ్డ మనదైన క్రీడ ప్రో కబడ్డీ 8వ సీజన్ (Pro Kabaddi 8th Season) మళ్లీ మొదలుకానుంది. భారత్ లో ఐపీఎల్ (IPL) తర్వాత అత్యధికంగా టీవీ ప్రేక్షకులను అలరించే గేమ్ కబడ్డీ. ఇండోర్ గేమ్ అయిన కబడ్డీకి పూర్వ వైభవం కల్పిస్తూ.. కొత్త ఆటగాళ్లను వెలికితీయడానికి ఉద్దేశించిన ప్రో కబడ్డీ సీజన్ మళ్లీ మొదలుకాబోతుంది. 8వ సీజన్ గా వస్తున్న ఈ హై ఓల్టేజీ ఈవెంట్ డిసెంబర్ 22న ప్రారంభం కానుంది. బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగే కబడ్డీ (Pro Kabaddi League) మ్యాచ్ లకు కంఠీరవ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సీజన్ కు సంబంధించిన మ్యాచ్ లన్నీ ఇక్కడే నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ను లీగ్ నిర్వాహకులు ఇంకా విడుదల చేయలేదు. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల అవుతుంది. అన్ని మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ (Star Sports) నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దీంతో పాటు డిస్ని + హాట్స్టార్లో(Disney + HotStar) స్ట్రీమింగ్ చేయబడుతుంది.

పీకేఎల్ (Pro Kabaddi League) తొలి సీజన్లో కేవలం 8 జట్లు మాత్రమే తలపడ్డాయి. కానీ ప్రస్తుతం లీగ్లో 12 జట్లు ఉన్నాయి. ఇదిలాఉండగా ప్రో కబడ్డీ లీగ్ 2021 కోసం ఆటగాళ్లందరికీ ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిందని లీగ్ నిర్వాహకులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా ఈ లీగ్ ను నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. అయితే త్వరలో జరగబోయే 8వ సీజన్ కూడా ఈ ఏడాది జులైలోనే జరుగాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా దానిని అది వాయిదా పడింది.

ఈ సీజన్ కోసం ఆగస్టులో ఆక్షన్ నిర్వహించగా .. యూపీ యోధాస్ (UP Yoddha) టీమ్ పర్ దీప్ నర్వాల్ (Pardeep Narwal) ను లీగ్ లో మునుపెన్నడూ లేనంతగా రూ. 1.65 కోట్లకు కొంది. 8 వ సీజన్ కోసం ముందుగానే టీమ్ లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయ్. ప్రీ సీజన్ క్యాంప్ పేరిట నిర్వహిస్తున్న ఈ క్యాంప్స్ లో ఆటగాళ్లు తమ ఆటకు మెరుగులు దిద్దుతున్నారు.

2014లో 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్ ప్రేక్షకాదరణతో అంచెలంచెలుగా ఎదిగి మరో 4 జట్ల చేరికతో బిగ్ లీగ్గా అవతరించింది. ఐపీఎల్ తరహాలోనే అభిమానగణాన్ని సంపాదించుకుంది. కబడ్డీ ఆటగాళ్లపై కనకవర్షం కురిపిస్తోంది. ఎంతగా ఈ కబాడీ లీగ్ ఆదరణ సొంతం చేసుకుందంటే.. పీకేఎల్ ఏడో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు సుమారు 200 మంది ఆటగాళ్ల కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేశాయి. ఈ లీగ్ లో విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొంటూ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు.

తెలుగు టైటాన్స్ (Telugu Titans), బెంగాల్ వారియర్స్ (Bengal Warriors), బెంగళూరు బుల్స్ (Bengaluru Bulls), దబాంగ్ ఢిల్లీ (Dabang Delhi KC), జైపు పింక్ పాంథర్స్ (Jaipur Pink Panthers), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants), తమిళ్ వారియర్స్ (Tamil Thalaivas) , యూ ముంబా (U Mumba), హర్యానా స్టీలర్స్ (Haryana Steelers), యూపీ యోధా (UP Yoddha), పాట్నా పైరెట్స్ (Patna Pirates), పుణేరి పల్టాన్ (Puneri Paltan) జట్లు పీకేఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయ్. ఈ లీగ్ లో పట్నా పైరేట్స్ అత్యంత విజయవంతమైన జట్టు. ఈ టీమ్ మూడు సార్లు టైటిల్ ను ఎగరేసుకుపోయింది. జైపూర్ పింక్ పాంథర్స్, యూ ముంబా, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ టైటిల్ నెగ్గిన మిగతా జట్లు. మరి ఇంతవరకు టైటిల్ నెగ్గని తెలుగు టైటాన్స్ ఈసారైనా కప్ నెగ్గుతుందో లేదో వేచి చూడాలి.

Pro Kabaddi League 2021

 

స్టాండింగ్ / పాయింట్స్ టేబుల్

Teams P W L T PTS

Top Stories