Telugu News » Tag » Prabhas
Prabhas

Prabhas వార్తలు

    పేరు: ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు
    పుట్టిన రోజు: 23 అక్టోబర్ 1979
    రాబోయే సినిమాలు: రాధే శ్యామ్ (Radhe Shyam), ఆదిపురుష్ (AdiPurush), సలార్ (Salaar), ప్రాజెక్ట్ – K (నాగ్ అశ్విన్ దర్శకత్వం), స్పిరిట్ (సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం), సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హిందీ సినిమా

    ప్రభాస్ 1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్య నారాయణ ప్రభాస్ రాజు. ఈయన తండ్రి సూర్య నారాయణ రాజు ప్రముఖ నిర్మాత. తల్లి శివ కుమారి సామాన్య గృహిణి. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై తన అన్నయ్య కృష్ణంరాజు (Krishnam Raju) హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.

    సినిమా ఆరంగేట్రం
    2002లో జయంత్.సి.పరాన్జీ (Jayanth C Paranji) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈశ్వర్’ మూవీతో తెరంగేట్రం. 2004లో వర్షం (Varsham) మూవీతో మొదటి బ్రేక్ లభించింది. ‘అడవిరాముడు’, ‘చక్రం’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. రెబల్ స్టార్ సినీ కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ‘చత్రపతి’ (Chatrapathi). రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ‘పౌర్ణమి’లో క్లాస్ క్యారెక్టర్, ‘యోగి’లో మదర్ సెంటిమెంట్‌తో కలిపిన యాక్షన్, ‘మున్నా’లో వెరైటీ యాక్షన్, ‘బుజ్జిగాడు’లో ఫుల్ మాస్ క్యారెక్టర్‌తో పాటు కామెడీని పండించారు. ‘బిల్లా’ మూవీతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు ప్రభాస్. ‘డార్లింగ్’ వంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ లోని మాస్‌ను మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో.. ప్రభాస్‌లోని నటుడిని చూశారు.

    ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు ప్రభాస్. ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచిన మూవీ మిర్చి (Mirchi). ఈ సినిమాలోని నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కి చేర్చిన సినిమా ‘బాహుబలి’ (Bahubali). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి పార్ట్‌ 2తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసారు.

    ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టులు
    రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నారు. 2022 ఆగష్టు 11న విడుదల ప్లాన్ చేశారు. ప్రభాస్ ..శ్రీరామచంద్రుడుగా నటించారు. ‘రాధే శ్యామ్’, ఆదిపురుష్‌’ల తర్వాత కేజీఎఫ్ (KGF) ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (Prasanth Neel) తో ‘సలార్’ (Salar) మూవీ చేస్తున్నారు. నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ నిర్మాణంలో ‘ప్రాజెక్ట్ K’ పేరుతో భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న ప్రభాస్. ప్రభాస్ తన 25వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. మరోవైపు హిందీ యాక్షన్ సినిమాల దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.