పేరు: పూజా హెగ్డే
పుట్టిన రోజు: 13 అక్టోబర్ 1990
రాబోయే సినిమాలు: రాధే శ్యామ్ (Radhe Shyam), ఆచార్య (Acharya), బీస్ట్ (తమిళం), సర్కర్ (హిందీ), సల్మాన్ ఖాన్ (Salman Khan) మరో సినిమా
పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై (Mumbai)లో జన్మించింది. తల్లి దండ్రులది కర్ణాటక (Karnataka) లోని మంగళూరు (Mangaluru) అయినా.. వీళ్ల కుటుంబం ముంబై లో సెటిల్ అయ్యారు. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళం కూడా మాట్లాడగలదు. పూజా భారతనాట్యంలో శిక్షణ పొందింది.
మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయింది. 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు. ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు.
తమిళ సినిమాతో తెరంగేంట్రం
పూజా హెగ్డే ఫస్ట్ మూవీ తమిళ మూవీ ‘మూగముడి’. జీవా హీరోయిన్గా నటించిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే. ఆ తర్వాత బాలీవుడ్లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాలో కథానాయికగా నటించింది. తెలుగులో ఇప్పటి వరకు తొమ్మిది సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా ఐటెం పాటలో మెరిసింది.
వరుసగా అరవింద సమేత వీరరాఘవ (Aravinda Sametha Veera Raghava), మహర్షి (Maharshi), అల వైకుంఠపురములో (Ala Vaikuntapuramuloo) వంటి హాట్రిక్ సక్సెస్‌లతో దూకుడు మీదున్న పూజా హెగ్డే. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelore) సినిమాతో డబుల్ హాట్రిక్కు శ్రీకారం చుట్టింది.
రాబోయే సినిమాలు
ప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ సినిమాలో కథానాయికగా నటించింది. ‘ఆచార్యలో రామ్ చరణ్, సరనన నటిస్తోంది. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే 2022 ఫిబ్రవరి 4న విడుదల కానుంది. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘బీస్ట్’ సినిమాలో యాక్ట్ చేస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్కస్’ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది.
పూజా హెగ్డేను వరించిన అవార్డులు
మూగముడితో పాటు పలు సినిమాలకు బెస్ట్ యాక్ట్రెస్‌గా నామినేట్ అయినా.. తొలిసారి ‘అల వైకుంఠపురములో’ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్‌గా సైమా అవార్డు అందుకుంది.