Telugu News » Tag » Pawan Kalyan
pawan kalyan

Pawan Kalyan వార్తలు

    పవన్ కళ్యాణ్
    పుట్టిన రోజు : సెప్టెంబర్ 2న 1971

    రాబోయే సినిమాలు: భీమ్లా నాయక్ (Bheemla Nayak), హరిహర వీరమల్లు (Harihara Veeramallu)

    పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2, 1971న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు. చిరంజీవి (Chiranjeevi) తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయ్యారు. ఆ తర్వాత ‘సుస్వాగతం’ (Suswagatam) , ‘తొలిప్రేమ’ (Toliprema), ‘తమ్ముడు’ (Tammudu) సినిమాలతో యూత్ ను తనవైపు తిప్పుకున్నారు. పూరీ జగన్నాధ్ ‘బద్రి’ (Badri) సినిమాతో తనలోని స్టైల్, స్టామీనాను నిరూపించుకున్న పవన్.. ఖుషి (Khushi) సినిమాతో అభిమానుల హృదయాల్లో బంగారం అయ్యారు. ‘ఖుషి’ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గని పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా (Jalsa)తో అలరించారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటిది దారేది’ (Attarintiki Daredi) సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మధ్యలో ‘తీన్మార్’ (Teenmar), ‘పులి’ (Puli) సినిమాలు కొంత నిరాశపరిచిన.. ‘కాటమరాయుడు (Katamarayudu) ఈ యేడాది వకీల్ సాబ్‌ (Vakeel Saab)గా పలరించారు.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. సాగర్ కే.చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో హరి హర వీరమల్లు చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు సురేందర్ రెడ్డి (Surendar Reddy) దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు.

    మరోవైపు పవన్ కళ్యాణ్.. రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

    రాజకీయ ప్రయాణం
    పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి స్థాపించి ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో సొంతంగా జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు గెలిచింది.