MS Dhoni

Ms Dhoni వార్తలు

    పేరు : మహేంద్ర సింగ్ ధోని

    పుట్టిన తేది : 7 జులై 1981

    జట్లు : టీమ్ ఇండియా (Team India) , బీహార్ రంజీ జట్టు (Bihar Ranji Team) , జార్ఖండ్ రంజీ జట్టు (Jharkhand Ranji Team), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) , రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (Rising Pune Jaints)

    మిస్టర్ కూల్‌ మహేంద్ర సింగ్ ధోని జార్ఖండ్  (Jharkhand) రాజధాని రాంచీలో జన్మించాడు. బీహార్ క్రికెట్ జట్టుకు ఆ తర్వాత జార్ఖండ్ జట్టుకు ధోనీ దేశవాళీ క్రికెట్ ఆడాడు. 2005 డిసెంబర్‌లో శ్రీలంక (Srilanka) పై టెస్టుల్లో, 2004 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో అరంగేట్రంచేశాడు. టీమ్ ఇండియా విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. ధోనీ తన కెరీర్‌లు 90 టెస్టులు ఆడి 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 224 అతడి టాప్ స్కోర్. టెస్టుల్లో 256 క్యాచ్‌లు పట్టగా.. 38 స్టంపింగ్స్ చేశాడు. ఇక 350 వన్డేలు ఆడి 50.53 సగటుతో 10773 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 183 అతడి అత్యధిక స్కోర్. ఇక 321 క్యాచ్‌లు పట్టగా.. 123 స్టంపింగ్స్ చేశాడు. 98 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 1617 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ద సెంచరీలు ఉన్నాయి.

    టీమ్ ఇండియాకు వన్డే వరల్డ్ కప్ (ODI World Cup), టీ20 వరల్డ్ కప్ (T20 World Cup), చాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఈ మూడు మెగా టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ కావడం గమనార్హం. మరోవైపు ఐపీఎల్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మధ్యలో సీఎస్కేపై నిషేధం విధించిన సమయంలో రెండేళ్లు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం సీఎస్కే జట్టు రూ. 12 కోట్లతో అతడిని రిటైన్ చేసుకున్నది.

    2010 జూలై 4న సాక్షితో ధోనీ పెళ్లి జరిగింది. వారికి ఓ కుమార్తె జీవా ఉంది.