పేరు: ఆర్కే రోజా సెల్వమణి
పుట్టిన రోజు : 17 నవంబర్ 1972
భర్త: ఆర్కే సెల్వమణి (RK Selvamani)
పిల్లలు: అన్షుమాలిక సెల్వమణి (Anshumalika Selvamani) , కృష్ణ లోహిత్ సెల్వమణి (Krishna Lohit Selvamani)
అసలు పేరు శ్రీలతా రెడ్డి (Sri Latha Reddy). 1972 నవంబర్ 17న నాగరాజ రెడ్డి (Nagaraju reddy), లలితా (Lalitha) దంపతులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లా (Chitoor District) తిరుపతి (Tirupati)లో జన్మించారు. రోజా తన డిగ్రీని తిరుపతి పద్మావతి యూనివర్సిటీ (Padmavati University)లో పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకముందు తన కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించారు. కథానాయికగా రోజా మొదటి చిత్రం ‘ప్రేమ తపస్సు’ (Prematapassu).ఈ చిత్రాన్ని దివంగత నటుడు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ( MP Shivaprasad) డైరెక్ట్ చేసారు. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) హీరోగా నటించిన ప్రేమ తపస్సు సినిమాలో రోజా కథానాయికగా నటించింది. శోభన్ బాబు (Shobhanbabu)కి కూతురిగా సర్పయాగం (Sarpayagam)సినిమాలో నటించి మెప్పిచింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ (Jabardasth) సహా పలు టీవీ చానల్స్‌లో ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్నారు.
ప్రేమ పెళ్లి..? సెల్వమణితో పరిచయం ఎలా..?
సీతారత్నం గారబ్బాయి సినిమా సూపర్ హిట్ కొట్టడంతో.. పక్క ఇండస్ట్రీ చూపు కూడా రోజాపై పడింది. తమిళంలో దర్శకుడు సెల్వమణి చేతుల మీదుగా చెంబురుతి (Chemburuthi)అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఇద్దరి పరిచయం తరువాత స్నేహంగా మారింది. ఆ స్నేహం కొంతకాలానికి ప్రేమగా మారింది. అయితే సెల్వమణి ప్రేమిస్తున్నా ఆ విషయం చాలా వరకు రోజాకు చెప్పలేదు. రోజా కన్నా ముందు ఆమె ఇంట్లో వాళ్లకు చెప్పి.. అక్కడ అంగీకారం లభించిన తరువాతే ఆయన రోజాకు తన ప్రేమ విషయం చెప్పారట. అలా పదేళ్ల పాటు వారి ప్రేమ ముందుకు సాగింది. ఇక చివరికి 2002 లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమార్తె అన్షుమాలిక, ఒక కుమారుడు కృష్ణ లోహిత్ సెల్వమణి ఉన్నారు.
రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది…?
రోజా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట టీడీపీ ద్వారా రాజకీయ ప్రవేశం ఇచ్చారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)సమక్షంలో కాంగ్రెస్ (Congress)లో చేరారు. ఆయన మరణం తరువాత.. తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పార్టీలో కొనసాగుతున్నారు. నగరి (Nagari) నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.