పేరు: ఘట్టమనేని మహేష్ బాబు
తల్లిదండ్రులు: ఘట్టమనేని ఇందిర, ఘట్టమనేని కృష్ణ (Ghattamaneni Krishna)
పుట్టిన రోజు: 9 ఆగస్ట్ 1975
భార్య పిల్లలు: భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Sirodkar), కుమారుడు గౌతమ్ కృష్ణ ఘట్టమనేని (Gautham Ghattamaneni), కుమార్తె సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni)
రాబోయే సినిమాలు: సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఒక సినిమా, రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో మరో సినిమా
మహేష్ బాబు1975 ఆగస్ట్ 9న చెన్నైలో హీరో కృష్ణ (Superstar Krishna), ఇందిర దంపతులకు నాల్గో సంతానంగా జన్మించారు. అన్న రమేష్ బాబు (Ramesh Babu).. ఇద్దరు అక్కలు పద్మావతి, మంజుల (Manjula), చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మహేష్ బాబు తన నాలుగో ఏట దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో ‘నీడ’ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైయ్యారు. హీరోగా తొలి చిత్రం ‘రాజకుమారుడు’. ‘యువరాజు’, ‘వంశీ’ చిత్రాలు ఆశించిన విజయాలు మహేష్ దక్కలేదు. మహేష్ బాబు లోని నటుడిని వెలికితీసిన సినిమా ‘మురారి’. మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరిదొంగ.
ఒక్కడు సినిమాతో స్టార్ డమ్
2003లో మహేష్ నటించిన ‘ఒక్కడు’ ఒక సెన్సెషనే క్రియేట్ చేసింది. ‘నిజం’ మూవీతో మహేష్ తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేసిన మరో ప్రయోగం ‘నాని’. అతడు సినిమా మహేష్ కెరీర్‌లో ఒక గొప్ప మైలురాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) మహేష్ తో పలికించిన డైలాగులు ఆడియన్స్ కు మెస్మరైజ్ చేశాయి. మహేష్ కెరీర్ గురించి పోకిరి (Pokiri) కి ముందు ఆతర్వాత అనేంతగా మారిపోయింది.
శ్రీనువైట్ల (Srinu Vaitla) డైరెక్షన్ లో చేసిన ‘దూకుడు’, పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో చేసిన ‘బిజినెస్ మేన్’ తో బంపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ (Venkatesh) తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చేసిన ‘నేనొక్కడినే’ సినిమా థ్రిల్లర్‌గా సినిమాగా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ‘ఆగడు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చేసిన ‘శ్రీమంతుడు’ సినిమా మహేష్ బాబు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ తర్వాత చేసిన ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ (Spidar) చిత్రాలు మహేష్ బాబు కెరీర్‌లోనే చెత్త సినిమాలుగా నిలిచిపోయాయి. వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) దర్శకత్వంలో చేసిన ‘మహర్షి సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నారు. త్వరలో పరశురామ్ (Parasuram Petla) దర్శకత్వంలో సర్కారు వారి పాట (Sarkaruvari Paata) సినిమాతో పలకరించనున్నారు.
8 నంది అవార్డులు.. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు
ఇక ‘నిజం’, ‘అతడు’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’ సినిమాల్లోని నటనకు ఉత్తమ నటుడిగా నాలుగు నంది అవార్డులు అందుకున్నాడు. ఇక ‘మురారి’, ‘టక్కరి దొంగ’ ’అర్జున్, సినిమాల్లోని నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు వరించాయి. ఇక హీరోగా ఫస్ట్ మూవీ ‘రాజకుమారుడు’ ఉత్తమ నూతన నటుడిగా అవార్డు లభించింది. మొత్తంగా 8 నంది అవార్డులు అందుకున్నాడు. ఇక ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శ్రీమంతుడు’ సినిమాల్లోని నటనకు బెస్ట్ యాక్టర్‌గా 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులును అందుకున్నాడు.
రాబోయే సినిమాలు
మహేష్ బాబు త్వరలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో పలకరించనున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ సినిమా చేయనున్నాడు.