HOME » karthika deepam
karthika deepam

Karthika Deepam

కార్తీక దీపం

కార్తీక దీపం (Karthika Deepam Serial).. తెలుగు బుల్లితెరపైనే కాదు.. బహుశా ఇండియన్ టెలివిజన్‌లోనే మునుపెన్నడూ లేని టీఆర్పీలను పరిచయం చేసిన సీరియల్ ఇదేనేమో..? ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ అనేది ఓ అడిక్షన్. వంటలక్క అనేది పేరు కాదు.. ఒక వ్యసనం. వదులుకోలేని వ్యసనంగా మారిపోయింది కార్తీక దీపం సీరియల్. ఇప్పటికే 1200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 2017లో మొదలైన కార్తీక దీపం.. అనేక మలుపులు తిరుగుతూ 2021లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మధ్య సీరియల్ అయిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటిదేం లేదని.. మరో ఏడాదిన్నర వరకు కూడా ఈ సీరియల్‌కు ఢోకా లేదని తెలుస్తుంది. ఇప్పటికే మలయాళంలో ఈ సీరియల్ అయిపోయింది. దాంతో అక్కడి క్లైమాక్స్‌నే ఇక్కడ కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది.

తెలుగులో ఎలా చూసుకున్నా కూడా మరో 350 ఎపిసోడ్స్ వరకు ఇందులో బాకీ ఉన్నాయి. అయితే వంటలక్క ప్రాణాలు కోల్పోతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో గృహిణిల కన్నీరుతో వరదలు వచ్చేస్తాయేమో..? ఓ సారి దర్శక నిర్మాతలు ఈ విషయంపై కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే మలయాళంలో ఎలా ముగించినా పెద్దగా పట్టించుకోరు కానీ తెలుగులో మాత్రం విషాదాంతం ఇస్తే కన్నీటి వర్షం పారుతుంది. మునపటిలా మాత్రం ఇప్పుడు కార్తీక దీపం సీరియల్‌కు టీఆర్పీ రావడం లేదు. దాని గురించి నిర్వాహకులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.

Karthika Deepam - All Results

 

Live Now

    Top Stories