పేరు: కల్వకుంట్ల కవిత
పుట్టిన రోజు: 3 మార్చి 1978
తల్లిదండ్రులు: కల్వకుంట్ల శోభ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrasekhar Rao)
భర్త దేవనపల్లి అనిల్, కుమారులు ఆదిత్య, ఆర్య
సోదరుడు: కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao)
పార్టీ: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)
కల్వకుంట్ల కవిత మార్చి 3 , 1978న జన్మించారు. ప్రాధమిక విద్య హైదరాబాద్‌లోని (Hyderabad) స్టాన్లీ హై స్కూల్‌లో కొనసాగింది. వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నుంచి బీటెక్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ లో ఎం.ఎస్ ను అమెరికాలోని (United States of America ) దక్షిణ మిసిసిపీలో పూర్తిచేశారు. కొంతకాలం పాటు అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసి 2004లో భారత్‌కు తిరిగి వచ్చారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గోన్నారు. అనంతరం తెలంగాణ (Telangana) మలి దశ ఉద్యమం ప్రారంభదశలో 2009 నుంచి 2014 వరకు అనేక ఉద్యమాల్లో పాల్గోన్నారు.
తెలంగాణ జాగృతి ఏర్పాటు (Telangana Jagruthi)
తెలంగాణ భాషను పరిరక్షించేందుకు తెలంగాణ జాగృతి పేరిట ఓ సంస్థను స్థాపించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ (Bathukamma) పండగను పెద్ద ఎత్తున నిర్వహించడంతోపాటు విదేశాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రాదాయాలను చాటి చెప్పారు. నేటికీ బతుకమ్మ ఉత్సవాల్లో చురుకుగా పాల్గొంటూ ఆ పండగకు మరింత ప్రాచుర్యాన్ని తీసుకు వచ్చారు.
రాజకీయ ఆరంగేట్రం
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లో నిజామాబాద్ (Nizamabad) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో ధర్మపురి అర్వింద్ (Dharmapuri Aravind) చేతిలో ఓడిపోయారు. 2020 అక్టోబర్‌లో తెలంగాణ శాసనమండలికి నిజామాబాద్, కామారెడ్డి (Kamareddy) జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసి 672 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచారు. అనంతరం 2021లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా
కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్న సమయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా 2015లో తొలిసారి, ఏప్రిల్ 2, 2021న రెండవసారి ఎన్నికయి.. ఆ పదవిలో కొనసాగుతున్నారు.