పేరు: నందమూరి తారక రామారావు
పుట్టిన రోజు: 20 మే 1983
తల్లిదండ్రులు: నందమూరి షాలిని, నందమూరి హరికృష్ణ (Nandamuri Hari Krishna)
భార్య పిల్లలు: భార్య లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) . ఇద్దరు కుమారులు నందమూరి అభయ్ రామ్ (Nandamuri Abhay Ram) , నందమూరి భార్గవ రామ్ (Nandamuri Bhargav Ram)
నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) మే 20న 1983న హైదరాబాద్ (Hyderabad) లో జన్మించారు. తల్లిదండ్రులు షాలిని, హరికృష్ణ. తెలుగు సినీ పరిశ్రమలో పేరొందిన నందమూరి వంశం మూడో తరం వారసుడిగా తెరంగేట్రం చేశారు. మొదటిసారి తెరపై కనిపించిన చిత్రం ‘రామాయణం’. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ తో.. హీరోగా తొలిసారి సక్సెస్ రుచి చూసారు. సింహాద్రి, ఆది, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఉన్నాయి. ఇప్పటి వరకు 30కి పైగా సినిమాల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో నాల్గోసారి ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చేసారు. చిత్రంలో ఎన్టీఆర్ .. కొమరం భీమ్ పాత్రలో నటించారు.
జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాలు
కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
వరించిన అవార్డులు, రివార్డులు
టెలివిజన్ పై తారక్
భక్త మార్కండేయ సీరియల్లో టైటిల్ రోల్ పోషించిన ఎన్టీఆర్.. బిగ్‌బాస్ (Bigg Boss Telugu) తెలుగు సీజన్ 1 తో పాటు ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru Meelo Koteeswarulu) రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించి స్మాల్ స్క్రీన్ పై అలరించారు.