నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను ఇండియన్ రైల్వే (Indian Railways) వారి వారి గమ్య స్థానాలకు చేర్చుతుంది. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రైళ్లలో టికెట్లు (Train Ticket Booking) అప్పటికప్పుడు దొరకడం చాలా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందస్తుగా సీటును రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కల్పించింది.
టికెట్ రిజర్వేషన్ (Train Ticket Reservation) కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్ కో లేదా దగ్గర లోని టికెట్ బుకింగ్ సెంటర్ కో వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా మనం ఇంట్లో నుంచే టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఇండియన్ రైల్వే ప్రారంభించింది. ఇందు కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పోర్టల్ ను ప్రారంభించింది ఇండియన్ రైల్వే. ఈ పోర్టల్ ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచే సింపుల్ గా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఇందుకు సంబంధిచిన ఛార్జీని సైతం ఆన్లైన్లో సులువుగా చెల్లించొచ్చు. టికెట్ ను క్యాన్సెల్ చేసుకోవడం కూడా ఈ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా కేవలం టికెట్ బుకింగ్ మాత్రమే కాదు.. టూరిజం, కేటరింగ్ తదితర అనేక సదుపాయాలను ప్రయాణికులకు చేరువ చేసింది ఇండియన్ రైల్వే. IRCTC ద్వారా ప్రయాణికులకు అనేక ఆఫర్లను కూడా అందిస్తోంది ఇండియన్ రైల్వే. దీంతోపాటు టూరిజం ప్యాకేజీలను (IRCTC Tourism Packages) కూడా అందిస్తోంది. IRCTC పోర్టల్ లో వచ్చే మార్పులు, కొత్త రూల్స్, ఆఫర్లు తదితర సమగ్ర వివరాలను, ప్రత్యేక కథనాలను News18 Telugu ఎప్పటికప్పుడు పాఠకులకు అందిస్తూ ఉంటుంది.