పూర్తి పేరు: తన్నీరు హరీష్ రావు
పుట్టిన రోజు: 3 జూన్ 1972
తల్లిదండ్రులు: లక్ష్మీబాబు, సత్యనారాయణ
పార్టీ: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)
తన్నీరు హరీష్ రావు (Thanneeru Harish rao) 1972 జూన్ 3న సత్యన్నారాయణ, లక్ష్మీబాయి దంపతులకు ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా సిద్దిపేట (Siddipet) సమీపంలోని చింతమడక (Chintamadaka) గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ప్రాధమిక విద్య వాణినికేతన్ స్కూల్లో కొనసాగింది. అనంతరం హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు (K Chandrasekhar Rao) ఆయన మేనల్లుడు. తెలంగాణ (Telangana) ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచారు. ఉద్యమ సమయంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభుత్వ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనాలు సృష్టించారు.
హరీశ్ రావు 2004 లో తొలిసారిగా అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) కేబినెట్లో యువజన సర్వీసులు, ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ కేబినెట్లో నీటిపారుదల శాఖను నిర్వహించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ, వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నారు.