బంగారం (Gold) అంటే భారతీయులకు, అందులో ముఖ్యంగా మహిళలకు అత్యంత ఇష్టమైన వస్తువు. పేదల నుంచి మొదలుకుని ఏ స్థాయి వారింట్లో శుభకార్యం జరిగినా.. వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా బంగారం కొనుగోలు మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. అందుకే బంగారం ధర (Gold Rates) ఎంత పెరిగినా సరే.. దీని కొనుగోళ్లు ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. కేవలం అలంకరణ కోసమే కాదు.. పెట్టుబడిగా కూడా బంగారం (Gold Investments) ఉపయోగపడుతుంది. బంగారం ధరలు (Gold Prices) రోజు రోజుకూ పెరుగుతుండటంతో బంగారం పెట్టుబడి పెడితే లాభాలే తప్పా.. నష్టాలు వచ్చే అవకాశమే లేదని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో బంగారం కొని భద్రపరుచుకుంటున్నారు.
ఇంకా చాలా మంది పిల్లల వివాహాల కోసం ముందుగానే బంగారం కొంటుంటారు. ఇంకా బంగారంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చాలా తక్కువ వడ్డీకే రుణాలు (Gold Loans) ఇస్తూ ఉంటాయి. చాలా మంది అత్యసవర సమయాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బంగారం ధర విషయంలో ప్రజలకు అత్యంత ఆసక్తి ఉంటుంది. బంగారం ధర పెరిగినా, తగ్గినా లేదా స్థిరంగా ఉన్నా.. ఇలా బంగారం ధర ఎలా ఉన్నా కూడా అది హాట్ టాపికే అవుతోంది.
ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, డిమాండ్ తదితర ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో News18 Telugu మీకు ఎప్పటికప్పుడు బంగారం ధరలకు సంబంధించిన అప్ డేట్ లను ఇస్తూ ఉంటుంది. భవిష్యత్ లో బంగారం ధరలు పెరిగే లేదా తగ్గే అవకాశాలపై విశ్లేషణలు సైతం అందిస్తూ ఉంటుంది. బంగారంపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల తదితర వివరాలను కూడా మీరు News18 Telugu ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.