Telugu News » Tag » Epfo
EPFO

Epfo వార్తలు

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)… ఉద్యోగులకు ఈ సంస్థ గురించి పరిచయం అవసరం లేదు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే చట్టబద్ధమైన సంస్థ ఇది. ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్స్ (Provident Funds), పెన్షన్స్, జీవిత బీమా (Life Insurance) లాంటి పథకాలను నిర్వహిస్తుంది. భారతదేశంలో ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పీఎఫ్, పెన్షన్ (Pension), లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ అందించేందుకు కృషి చేస్తోంది.

    ఈపీఎఫ్ఓ మూడు పథకాలను నిర్వహిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్-1952, ఎంప్లాయీస్ డిపాజిట్ ఆధారిత ఇన్స్యూరెన్స్ స్కీమ్-1976, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995 పథకాలు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నాయి. ఈపీఎఫ్ఓలో 15 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారని అంచనా. ఈపీఎఫ్ఓ ఎపెక్స్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకుంటుంది.

    కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు 2014 అక్టోబర్ 1న యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను (UAN) ఉద్యోగులకు కేటాయించింది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరిటీ యూఏఎన్ ఉంటుంది. ఇది 12 అంకెల నెంబర్. ఉద్యోగరీత్యా వేర్వేరు కంపెనీలకు మారే ఉద్యోగులు వేర్వేరు పీఎఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే యూఏఎన్ కింద పీఎఫ్ అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు.

    ఉద్యోగుల వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ మొత్తం పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. యజమాని కూడా 12 శాతం మొత్తాన్ని ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తారు. యజమాని వాటాలో 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లోకి, 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి, 0.50 శాతం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లోకి వెళ్తే, 1.10 ఈపీఎఫ్ అడ్మిన్ ఛార్జీలు, 0.01 శాతం ఈడీఎల్ఐసీ అడ్మిన్ ఛార్జీలు ఉంటాయి.