cricket

Cricket వార్తలు

    ప్రస్తుత క్రీడా ప్రపంచంలో క్రికెట్ (Cricket) ఒక శక్తిగా అవతరించదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ తర్వాత క్రికెట్ నే ఎక్కువగా అభిమానిస్తారు. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు. ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దంలో ఆడినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు. సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. మైదానం మధ్యలో 20 మీటర్లు పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చారిత్రకంగా మనకు తెలిసినంతవరకూ 16వ శతాబ్దం ఉత్తరార్థం నుంచి క్రికెట్ ఆట చరిత్ర ప్రారంభమవుతోంది. ఆగ్నేయ ఇంగ్లాండ్‌ (England) లో పుట్టిన ఈ ఆట 18వ శతాబ్దంలో ఆ దేశానికి జాతీయ క్రీడగానూ, 19, 20 శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడగానూ అభివృద్ధి చెందింది. 1844 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నారు. 1877లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమైందని తర్వాతి తరాల చరిత్రకారులు గుర్తించారు.

    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్రికెట్‌ పరిపాలన చూస్తూంటుంది. దీనిలో వందకు దేశాలు, ప్రాంతాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం సభ్యదేశాల్లో పన్నెండు మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి. ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాటర్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాటర్లు , 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో తప్పనిసరిగా ఓ ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక కెప్టెన్ చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన ముఖ్యమైన నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ సెట్టింగ్ కు, బౌలింగ్ మార్పులకు సారథియే బాధ్యుడు.

    బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/ బ్యాటర్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు. రెండింటిలోనూ సత్తా చాటేవాళ్లు అతి తక్కువ మందే అని చెప్పొచ్చు. ఇక, ప్రతి మ్యాచుల్లో ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు ఉంటారు. అలాగే, ఓ ధర్డ్ అంపైర్ కూడా ఉంటాడు.