Telugu News » Tag » Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi వార్తలు

    పేరు: కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి)
    పుట్టిన రోజు : 22 ఆగస్టు 1955

    చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా మొగల్తూరు లో జన్మించారు. తల్లి అంజనాదేవి (Anjana Devi), తండ్రి వెంకట్రావు (Venkat Rao). తండ్రి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1978లో పునాదిరాళ్లతో ఆర్టిస్ట్‌గా సెలక్ట్ అయ్యారు. కానీ విడుదలైన ఫస్ట్ మూవీ ప్రాణంఖరీదు. 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

    చిరంజీవి కి మాస్ లో తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం ఖైదీ (Khaidi). ఈ సినిమాతో చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు. అభిలాష, చాలెంజ్, రాక్షసుడు వంటి 17 నవలా కథా చిత్రాల్లో వైవిధ్య పాత్రలు పోషించి మెప్పించారు. ఇక చిరంజీవితో ఎక్కువ చిత్రాల్లో హీరోయిన్ నటించిన ఖ్యాతి నటి రాధికకు (Radhika) దక్కుతుంది. ఆ తర్వాత రాధ (Radha), విజయశాంతి (Vijayashanti), మాధవి, భానుప్రియ వంటి హీరోయిన్లు చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించారు.

    1980లో సురేఖతో పెళ్లి

    1980లో చిరంజీవి అల్లురామలింగయ్య (Allu Ramalingaiah) కూతురు సురేఖను (Surekha) వివాహమాడారు. వీరికి ఇద్దరు కూతుళ్లు  సుస్మిత (Susmitha Konidela), శ్రీజ (Srija Konidela), ఒక కుమారుడు రామ్ చరణ్ (Ram Charan). ఇక చిరంజీవి సోదరులు నాగబాబు  (Nagababu) నిర్మాతగా.. పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు.

    చిరంజీవి చారిటబుల్ (Chiranjeevi Charitable Trust) ద్వారా నేత్రదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిరులో ఉన్న సేవా దృక్పథమే ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది. 2008 ప్రజారాజ్యం పార్టీ  (Prajarajyam Party) స్థాపించి 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 18స్థానాలతో సరిపెట్టుకున్నారు. 2009 ఎన్నికల్లో తిరుపతి (Tirupati), పాలకొల్లు (Palkol) నుంచి అసెంబ్లీకి పోటీ చేసారు చిరంజీవి. పాలకొల్లులో ఓడి, తిరుపతిలో గెలిచారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్  (Congress) లో విలీనం చేసారు. కాంగ్రెస్ తరుపున రాజ్యసభ కు ఎంపికయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) నేతృత్వంలోని కేంద్రమంత్రి వర్గంలో పర్యాటకశాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

    చిరంజీవి రాబోయే సినిమాలు
    ఆచార్య మూవీతో పలకరించనున్నారు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ (God Father) , భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలతో పాటు బాబీ  (Director Bobby) దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. దీంతో పాటు పలువురు దర్శకులు చెప్పిన కథలను లైన్‌లో పెట్టారు.