Chandrababu Naidu

Chandrababu Naidu వార్తలు

    నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా (Chittoor District) నారావారి పల్లెలో నారా ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్యను శేషాపురంలో పూర్తి చేశారు. చంద్రగిరి (Chandragiri) జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. తిరుపతి (Tirupathi) 10వ తరగతి పూర్తి చేసిన ఆయన.. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. అనంతరం ఎకనమిక్స్ లో పీజీ చేశారు. చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ (Congress)లో చేరారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో అప్పటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గాంధీకి సన్నిహితుడయ్యారు. అలాగే ఎస్వీ యూనివర్సిటీ ఎన్నికల్లోనూ ఆయన ప్రతిభ చూపారు.

    రాజకీయ ప్రస్థానం..
    యువజన కాంగ్రెస్ లో ఉత్సాహంగా పనిచేసి పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించిన చంద్రబాబు నాయుడు.. 1978లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కొంతకాలం రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా ఉన్నారు. అనంతరం 1980 నుంచి 1983 టంగుటూరి అంజయ్య (Tanguturi Anjaiah) కేబినెట్లో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ (NT Ramarao) దృష్టిలో పడ్డారు. దీంతో ఆయన మూడవ కుమార్తె భువనేశ్వరి (Nara Bhuvaneswari) ని ఇచ్చి వివాహం చేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని (Telugu Desam Party) స్థాపించినా చంద్రబాబు మాత్రం చేరలేదు. అవసరమైతే మామపై పోటీచేస్తానని ప్రకటించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై తెలుగుదేశం  విజయం సాధించింది. చంద్రగిరిలో చంద్రబాబు కూడా ఓటమి పాలయ్యారు.

    తెలుగుదేశంలో ముఖ్యనేత నుంచి ముఖ్యమంత్రిగా..
    1983 ఎన్నికల తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు. అతితక్కువ కాలంలోనే పార్టీలో ముఖ్యనేతగా ఎదిగిన చంద్రబాబు 1985 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు  (Nadendla Bhaskar Rao) ఉదంతంలో టీడీపీ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వారితో ఏకంగా రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి మామ సీఎం పీఠాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కుప్పం (Kuppam)లో విజయం సాధించిన చంద్రబాబుకు ఎన్టీఆర్ రెవెన్యూ శాఖను అప్పగించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని ఎన్టీఆర్ ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు అసెంబ్లీలో పార్టీని నడిపించారు.

    ఎన్టీఆర్ పై తిరుగుబాటు
    1994ఎన్నికల్లో టీడీపీతో పాటు చంద్రబాబు కూడా విజయం సాధించారు. అదే సమయంలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని (Lakshmi Parvati) పెళ్లి చేసుకోవడం.., ప్రభుత్వంలో, పార్టీలో ఆమె జోక్యం ఎక్కువ కావడంతో చంద్రబాబు తిరుగుబాటు చేశారు. పార్టీలోని 160 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొని ఎన్టీఆర్ ను పదవి నుంచి దింపి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 1999లోనూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం పదవి దక్కించుకున్నారు. అలా 9ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నారు.