Telugu News » Tag » Budget 2023

Budget 2023 News (బడ్జెట్ వార్తలు)

    కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వేతన జీవులకు మంచి కబురు అందించారు. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండబోదని ప్రకటించారు. అలాగే, మౌలిక వసతుల రంగానికి ఏకంగా రూ.10 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేకు రూ.2.4 లక్షల కోట్లతో చరిత్రలో లేనంత బడ్జెట్‌ను కేటాయించారు. విద్యార్థులకు, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల కోసం ఓ కొత్త స్కీమ్ తెచ్చింది.

    • గోల్డ్ బార్స్ నుంచి తయారు చేసే ప్రొడక్టులపై దిగుమతి సుంకం పెరిగింది.
    • కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీపై కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం నుంచి 15 శాతానికి చేరింది.
    • ల్యాబ్‌ గ్రోన్ డైమండ్స్ తయారీలో ఉపయోగించే సీడ్స్‌పై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది.
    • రొయ్యల మేతపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. ఎగుమతులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
    • సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ పెరిగింది. అంటే సిగరెట్ల ధరలు పెరగనున్నాయి.
    • టీవీ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించారు. ఇదివరకు ఇది 5 శాతంగా ఉండేది. అంటే టీవీల ధరలు తగ్గుతాయి.
    • కెమెరా లెన్స్‌పై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. ఏడాది పాటు ఈ బెనిఫిట్ లభిస్తుంది.
    • డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్, యాసిడ్ గ్రేడ్ ఫ్లోరోస్పార్ వంటి వాటి ధరలు దిగి రానున్నాయి.