Telugu News » Tag » Ap Cm Ys Jagan Mohan Reddy
ap cm ys jagan mohan reddy

Ap Cm Ys Jagan Mohan Reddy వార్తలు

    పేరు: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
    పుట్టిన రోజు: 21 డిసెంబర్ 1972
    తల్లిదండ్రులు : వైఎస్ విజయమ్మ (YS Vijayamma), వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) 
    భార్య : వైఎస్ భారతిరెడ్డి (YS Bharati Reddy) 
    పిల్లలు : హర్ష రెడ్డి (Harsha Reddy), వర్ష రెడ్డి (Varsha Reddy)
    సోదరి : వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) 
    పదవులు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (30 మే 2019 నుంచి), కడప ఎంపీ (1 జూన్ 2009 – 18 మే 2014), పులివెందుల ఎమ్మెల్యే (19 జూన్ 2014 నుంచి)
    రాజకీయ పార్టీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ( 12 మార్చి 2011)

    వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి (YS Jaganmohan Reddy) డిసెంబ‌ర్ 21, 1972 న క‌డ‌ప (Kadapa) జిల్లాలోని పులివెందులలో (Pulivendula) జ‌న్మించారు. తల్లిదండ్రులు వైఎస్ విజయమ్మ , వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ అంటే యెడుగూరి సందింటి. వైఎస్ జగన్ త‌న పాఠ‌శాల విద్య‌ను హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ (Hyderabad Public School) నుంచి, నిజాం క‌ళాశాల (Nizam College) నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. బి.కామ్ డిగ్రీతో పాటు, ఎంబీఏ చ‌దివారు. ఆగ‌స్టు 28, 1996 నాడు జ‌గన్ మోహ‌న్ రెడ్డి వివాహం భార‌తిరెడ్డి ( YS Bharati Reddy) జ‌రిగింది. భారతిరెడ్డి తండ్రి పిల్ల‌ల వైద్యులు డా.ఈ.సీ. గంగిరెడ్డి . జ‌గ‌న్, భార‌తిరెడ్డిలకు ఇద్ద‌రు కూతుళ్లు హర్ష రెడ్డి (Harsha Reddy) , వర్ష రెడ్డి (Varsha Reddy).

    1999-2000లో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చిన్న పారిశ్రామిక వేత్త‌గా ఉన్నారు. 1999-2000 మ‌ధ్య జ‌గ‌న్ చిన్న త‌రహా విద్యుత్ కంపెనీ సండూర్‌ పవర్ (Sandur Power) క‌ర్ణాట‌క‌ (Karnataka) లో ఏర్పాటు చేసి త‌న బిజినెస్ కెరీర్‌ని ప్రారంభించారు. అనంత‌రం ఆ కంపెనీని ఈశాన్య రాష్ట్రాల‌కు విస్త‌రింప‌జేశారు. మీడియా రంగంలోకి అడుగు పెట్టి సాక్షి దినపత్రిక, టెలివిజన్‌ను నడుపుతున్నారు.

    రాజకీయ జీవితం
    2009 భార‌త జాతీయ కాంగ్రెస్ పార్టీ (Congress Party) త‌ర‌పున క‌డ‌ప పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు.
    2010 15 వ లోక్‌స‌భ‌లో (Loksabha) త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు.
    2011 ఉప ఎన్నిక‌ల్లో గెలిచి, జూన్ 13న ఆయ‌న తిరిగి 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
    12 మార్చి 2011 న ఆయ‌న యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు.
    2014 జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎమ్మెల్యేగా రికార్డు విజయం
    2019లో ఎమ్మెల్యేగా విజయం.. ముఖ్యమంత్రి పదవి

    అవినీతి కేసులు.. జైలు జీవితం
    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణల కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో విబేధించిన తర్వాత ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ కేసుల్లో 16 నెలల జైలు జీవితం గడిపారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అండగా నిలిచారు. వైఎస్ జగన్ జైల్లో ఉన్పప్పుడు అన్న వదిలిన బాణంగా షర్మిళ అండగా నిలబడ్డారు.