Telugu News » Tag » Allu Arjun
Allu Arjun

Allu Arjun వార్తలు

  పేరు: అల్లు అర్జున్

  పుట్టిన రోజు: 8 ఏప్రిల్ 1983

  సినిమాలు: బాలనటుడిగా విజేత, స్వాతిముత్యం, డాడీ. హీరోగా గంగోత్రి (Gangotri) , ఆర్య (Arya), బన్నీ (Bunny) , హ్యాపీ (Happy), దేశముదురు (Deshamuduru), పరుగు (Parugu), ఆర్య 2 (Arya 2), వరుడు (Varudu), వేదం (Vedam), బద్రీనాథ్ (Badrinath), జులాయి (Julayi), ఇద్దరమ్మాయిలతో (Iddarammayilatho), రేసుగుర్రం (Race Gurram) , సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy), రుద్రమదేవి (Rudramadevi), సరైనోడు (Sarrainodu) , దువ్వాడ జగన్నాథం (Duvvada Jagannadham), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya Naa Illu India), అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo), పుష్ప – ది రైజ్(Pushpa – The Rise).

  గెస్ట్ రోల్: శంకర్ దాదా జిందాబాద్, ఎవడు

  అవార్డులు:
  నంది అవార్డులు – గంగోత్రి, ఆర్య, పరుగు, వేదం, రుద్రమదేవి
  ఫిల్మ్‌ఫేర్ అవార్డులు – పరుగు, వేదం, రేసుగుర్రం, రుద్రమదేవి, సరైనోడు

  అల్లు అర్జున్. నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మార్మోగిన ఈ పేరు.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. పుష్ప సినిమా గురించి ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. తొలి సినిమాలో చూసిన బన్నీ.. ఇప్పుడు పుష్ప సినిమాలో చూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఎంతో తేడా ఉంది. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అల్లు అర్జున్. విమర్శలు కూడా సంతోషంగా స్వీకరించాడు. ఈయన హీరో ఏంట్రా బాబు.. ఇలా ఉన్నాడు.. హీరోకు ఉండాల్సిన లక్షణం ఒక్కటైనా ఉందా ఈ కుర్రాడిలో.. అల్లు అరవింద్ కొడుకు అయినంత మాత్రాన హీరో అయిపోతాడా.. అంటూ ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నింటిని చాలెంజింగ్ గా తీసుకొని ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు అల్లు అర్జున్.

  ఏప్రిల్ 8, 1983 లో చెన్నైలో జన్మించాడు అల్లు అర్జున్. తల్లిదండ్రులు అల్లు నిర్మల, అల్లు అరవింద్. ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నారు. అల్లు బాబి (Allu Bobby) , అల్లు శిరీష్  (Allu Sirish) అందరికీ తెలుసు. కానీ అల్లు రాజేష్ అనే ఇంకో అన్నయ్య ఉండేవాడు. ఏడేళ్ళ వయస్సులో ఉన్నపుడు ఒక ప్రమాదంలో అల్లు రాజేష్ మరణించాడు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి (Allu Sneha Reddy), కుమారుడు అల్లు అయాన్ (Allu Ayaan), కుమార్తె అల్లు అర్హ (Allu Arha).

  బాల నటుడిగా విజేత, స్వాతిముత్యం లాంటి సినిమాల్లో నటించాడు. 17 ఏళ్ల వయసులో చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిశాడు. 2003లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో మెయిన్ హీరో అయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించిన కూడా అల్లు అర్జున్ నటనకు ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆ వెంటనే ఆర్య సినిమాతో తనను తాను అద్భుతంగా మలుచుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అల్లు అర్జున్. బన్నీ, దేశముదురు, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే, అల వైకుంఠపురంలో లాంటి సినిమాలతో తన మార్కెట్ వంద కోట్లకు పైగా పెంచుకున్నాడు అల్లు అర్జున్. తాజాగా విడుదలైన పుష్ప సినిమా కేవలం 3 రోజుల్లోనే 150 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది.

  బాహుబలి కాకుండా 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఏకైక తెలుగు సినిమా అల వైకుంఠపురంలో. ఆ రికార్డు కూడా అల్లు అర్జున్ పేరు మీద ఉంది. ఇప్పుడు పుష్ప సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా వసూళ్ళ పరంగా రికార్డులు తిరగరాస్తోంది. సినీ ప్రయాణంలో 5 నంది అవార్డులు.. 5 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. హైదరాబాద్‌లో 800 జూబిలీ పేరుతో ఒక నైట్ క్లబ్ ఉంది.