TDP

Tdp వార్తలు

    నందమూరి తారక రామారావు (NT Rama Rao) 1982 మార్చి 2వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) విధానాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ ఆవిర్భవించింది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) ఏకంగా 202 స్థానాలు కైవసం చేసకొని రికార్డు సృష్టించింది. అలాగే 42కి గానూ 30 లోక్ సభ స్థానాలను దక్కించుకుంది. 1984 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 400 స్థానాలు కైవసం చేసుకున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం హవా ముందు నిలబడలేకపోయింది. 35 లోక్ సభ స్థానాలతో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఐతే 1983లో నాటకీయ పరిణామాల మధ్య ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskar Rao) సీఎం ఆయ్యారు. ఆ తర్వాత ఆయన తన సీఎం పీఠాన్ని దక్కించుకోగలిగారు. ఐతే 1984లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ 202 స్థానాల్లో గెలిచి మళ్లీ సీఎం అయ్యారు. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం 74 స్థానాలకపై పరిమితమైంది. 1994లో ఏకంగా 216 స్థానాలతో గెలిచి మళ్లీ అధికారం దక్కించుకుంది. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా “నేషనల్ ఫ్రంట్” కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు. “నేషనల్ ఫ్రంట్”కు ఎన్టీఆర్ చైర్మెన్ గా కూడా వ్యవహరించారు

    నాయకత్వ మార్పు-వివాదాలు
    1994 ఎన్నికల ముందు ఎన్టీ రారావు, లక్ష్మీ పార్వతిని (Lakshmi Parvati) వివాహం చేసుకున్నారు. ఆమె ప్రభుత్వ, పాలనా వ్యవహారాల్లో అధికంగా జోక్యం చేసుకుంటుందంటూ ఎన్టీఆర్ పై ఆయన అల్లుడు, అప్పటి రెవెన్యూ మంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీలో అధిక శాతం ఎమ్మెల్యేలు చంద్రబాబువైపు నిలబడటంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో జరిగిన హోటల్ వైశ్రాయ్ ఘటన ఇప్పటికీ చర్చనీయాంశమే. ఆ సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు వైపే నిలబడ్డారు. ఆ తర్వాత ఏడాదిలో ఎన్టీఆర్ అనారోగ్యంతో కన్నుమూశారు.

    చంద్రబాబు నాయకత్వం
    1999 చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన టీడీపీ 180 సీట్లతో మరోసారి అధికారం చేజిక్కించుకుంది. 2004లో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. కేవలం 47 సీట్లకే పరిమితమై ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. 2009లో సీట్ల సంఖ్య పెరిగినా అధికారం మాత్రం దక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena Party) – బీజేపీ  (BJP) మద్దతుతో టీడీపీ విజయం సాధించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి 175 స్థానాలకు గానూ కేవలం 23 సీట్లకే పరిమితమై పార్టీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఘోరమైన పరాజయం చవిచూసింది.